20న దేశవ్యాప్త సమ్మె

AKP: మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కరించాలని, వారిని పర్మినెంట్ చేయాలని కోరుతూ 20న దేశవ్యాప్త సమ్మె చేస్తున్నట్లు సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాజు తెలిపారు. బుధవారం నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ సురేంద్రకు ఏపీ మున్సిపల్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్(సీఐటీయూ) ఆధ్వర్యంలో సమ్మె నోటీసు చేశారు. రాజు మాట్లాడుతూ.. సమ్మెను జయప్రదం చేయాలన్నారు.