కాలభైరవ స్వామి ఆలయానికి నవగ్రహాల విరాళం
SDPT: బెజ్జంకి మండలంలోని వడ్లూరు గ్రామంలో నిర్మాణంలో కొనసాగుతున్న శ్రీ స్వయం భూ కాల భైరవ స్వామి ఆలయానికి జెల్ల శ్రీనివాస్ నవగ్రహ విగ్రహాలను దానంగా సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఆయన భక్తి భావాన్ని కొనియాడారు. గ్రామాభివృద్ధికి, ఆధ్యాత్మిక వాతావరణానికి ఈ విరాళం ఎంతో దోహదపడుతుందని తెలిపారు. శ్రీనివాస్ కుటుంబంపై స్వామివారి కటాక్షం ఉండాలని కోరారు.