దేవస్థానం బహిరంగ టెండర్ల వేలం ముగింపు

దేవస్థానం బహిరంగ టెండర్ల వేలం ముగింపు

GDWL: శ్రీ జోగుళాంబ బాల బ్రహ్మేశ్వర దేవస్థానం ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన రెండు రోజుల బహిరంగ వేలం పాటలు ముగిశాయి.హెచ్చు పాట విధానంలో పిలిచిన 10 రకాల టెండర్లలో ఒడిబియ్యం సేకరణ హక్కును ప్రశాంతి (అలంపూర్), కొబ్బరి చిప్పల సేకరణ హక్కును అశోక్ దక్కించుకున్నారు. మిగతా టెండర్లకు సరైన కొటేషన్లు రాకపోవడంతో వాటిని వాయిదా వేసినట్లు దేవస్థానం ఈవో దీప్తి తెలిపారు.