VIDEO: దారుణం.. చిన్నారిని ముక్కలు, ముక్కలుగా..!
విశాఖలో దారుణం ఘటన చోటుచేసుకుంది. గురువారం తాటిచెట్లపాలెం ఏరియా సంజీవయ్య కాలనీలోని మురుగు కాలువలో చిన్నారి కాళ్లు, చేతులు, మొండెం వేర్వేరుగా పడి ఉన్నాయి. దీన్ని గమనించిన స్థానికులు వెంటనే కంచరపాలెం పోలీసులు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఇంత దారుణంగా చిన్నారిని ముక్కలు, ముక్కలుగా చేసి ఎందుకు ఇలా పడేశారనేది తెలియాల్సి ఉంది.