కాంగ్రెస్‌పై ECకి బీఆర్ఎస్ ఫిర్యాదు
HYD: సీఎం రేవంత్, మంత్రులు ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఢిల్లీ సీఈసీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అలాగే పోలింగ్ రోజు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఓట్ల రిగ్గింగ్, దొంగ ఓట్లకు పాల్పడే అవకాశం ఉందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ రిగ్గింగ్ చేసే అవకాశం ఉన్నందున ప్రతి పోలింగ్ కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, కేంద్ర బలగాలను నియమించాలని పేర్కొన్నారు.