రాకపోకలకు గండంగా మోత్కూరు-దోమ రోడ్డు
VKB: దోమ మండలం మోత్కూరు గ్రామంలోని పెద్ద గేట్ నుంచి ఐనాపూర్, దోమ వైపు వెళ్లే రోడ్డు మొబైల్ టవర్ సమీపంలో తీవ్రంగా ధ్వంసమైంది. ఈ రోడ్డు వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మారిందని, ఉదయం వాకింగ్ చేస్తున్న ఓ యువకుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు తక్షణమే స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేయించాలని ఆయన కోరారు.