ఓటు హక్కును వినియోగించుకున్న జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు
KMR: నిజాంసాగర్ మండలం బంజపల్లిలో ఆదివారం జరిగిన రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో డీసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటు హక్కు ఉన్న ప్రతి పౌరుడూ తమ ఓటును తప్పక వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ సమన్వయ కార్యకర్తలు గ్రామాలలో ఓటర్ సరళిని పరిశీలించాలన్నారు.