ఫ్యాన్సీ నెంబర్ల వేలంలో రూ. 43.51 లక్షల ఆదాయం
రంగారెడ్డి జిల్లా రవాణా శాఖ కార్యాలయానికి భారీగా ఆదాయం వచ్చింది. ఫాన్సీ నెంబర్ల వేలంపాటలో భాగంగా నిన్న రూ.43.51 లక్షల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. TG07AK9999 నెంబర్‌కు రూ. 9.72లక్షలు, TG07AL0001కు రూ. 4.16 లక్షలు, TG07AL0007 నెంబర్‌కు రూ. 3.56 లక్షలు, TG07L0099 నెంబర్‌కు రూ. 3 లక్షలకు దక్కించుకున్నట్లు తెలిపారు.