రేపు సత్యనారాయణ స్వామి వ్రతాలు
SDPT: వర్గల్ మండలం నాచగిరి క్షేత్రంలో రేపు కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని భారీ ఎత్తున సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించేందుకు ఏర్పాటు చేసినట్లు ఆలయ చైర్మన్ పల్లెర్ల రవీందర్ గుప్తా, ఈవో విజయ రామారావు తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు సత్యనారాయణ స్వామి వ్రతాలను విడతల వారీగా నిర్వహిస్తున్నట్లు వివరించారు.