అమరావతి అద్భుత నగరంగా మారుతుంది: ప్రధాని

అమరావతి అద్భుత నగరంగా మారుతుంది: ప్రధాని

అమరావతి పర్యటనపై ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. 'అమరావతి అభివృద్ధిలో సరికొత్త అధ్యాయం ప్రారంభించాం. భవిష్యత్తులో ఇది అద్భుత నగరంగా మారుతుంది. ఏపీ అభివృద్ధికి అమరావతి తోడ్పడుతుందని నమ్ముతున్నాను. ఏపీ ప్రజల సంక్షేమం పట్ల చంద్రబాబుకు గొప్ప నిబద్ధత ఉంది. ఆయన దార్శనికతను అభినందిస్తున్నా' అని పేర్కొన్నారు. ఏపీ పర్యటన దృశ్యాలు, ప్రసంగాన్ని ఎక్స్‌లో పోస్టు చేశారు.