'ఈనెల 15న పెనుకొండలో జాబ్ మేళా'
సత్యసాయి: పెనుకొండలోని పరిటాల శ్రీరాములు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 15న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ జయప్ప తెలిపారు. పదవ తరగతి, ఇంటర్, ITI, డిప్లొమా, బి.ఫార్మసీ, ఎం.ఫార్మసీ, నర్సింగ్, డిగ్రీ, బి.టెక్, పీజీ చదివి 18- 35 ఏళ్ల వయసు గల వారిని అర్హులుగా ప్రకటించారు. నెలకి రూ.13 వేల నుంచి రూ. 20 వేల వరకు జీతం ఉంటుందని పేర్కొన్నారు.