ఈనెల 18న కాకినాడలో జాబ్ మేళా

ఈనెల 18న కాకినాడలో జాబ్ మేళా

KKD: జిల్లా కలెక్టరేట్‌లోని వికాస కార్యాలయంలో ఈ నెల 18న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు పీడీ లచ్చారావు తెలిపారు. ఈ ఉద్యోగాలకు ఎస్.ఎస్.సీ నుంచి ఎం.బి.ఏ వరకు వివిధ విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు అర్హులని ఆయన అన్నారు. పలు మల్టీనేషనల్ కంపెనీలు ఈ మేళాలో పాల్గొంటాయన్నారు. అభ్యర్థులు ఆరోజు ఉదయం 9 గంటలకు హాజరు కావాలన్నారు.