కొనుగోలు కేంద్రాల్లో తరుగు పేరిట అధిక తూకం!

KNR: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తేమ, తాలు పేరుతో అధిక తూకం వేస్తున్నారు. రైస్ మిల్లర్లతో నిర్వాహకులు కుమ్మక్కై తాలు పేరిట అదనంగా రెండు కిలోలు ధాన్యాన్ని అధికంగా కాంటాలు వేస్తున్నారు. 40.650 కిలోలు తూకం వేయాల్సి ఉండగా.. 42 కిలోలు కాంటా వేస్తున్నారు. ఇదేమని అడిగితే ధాన్యాన్ని తాలు పట్టి తీసుకొని రావాలంటూ నిర్వాహకులు ఇబ్బందులకు గురి చేస్తున్నారు.