'చట్టాలపై అవగాహన పెంచుకోవాలి'

'చట్టాలపై అవగాహన పెంచుకోవాలి'

SKLM: బాలలు విద్యార్థి దశ నుంచే చట్టాలపై అవగాహన పెంచుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కే. హరిబాబు సూచించారు. మంగళవారం ఎచ్చెర్ల డీ. మత్యలేశంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించారు. క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలకు అధిరోహించేలా చదువుకోవాలని పిలుపునిచ్చారు.