VIDEO: అంగన్వాడీల అక్రమ అరెస్ట్.. ధర్నా
ELR: బుట్టాయిగూడెం మండల కేంద్రంలో మంగళవారం సిఐటియు , ఐఎఫ్టియు ఆధ్వర్యంలో అంగన్వాడీలు నిరసన వ్యక్తం చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని చలో విజయవాడ తలపెట్టిన కార్యక్రమంలో అంగన్వాడీల అక్రమ అరెస్టును ఖండించారు. తక్షణమే అంగన్వాడీలను విడుదల చేసి కుటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.