క్రీడా పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం

క్రీడా పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం

ప్రకాశం: జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని క్రీడా పురస్కారాలు అందించనున్నట్లు డీఈవో కిరణ్ కుమార్ చెప్పారు. క్రీడల్లో ప్రతిభ చూపిన జిల్లాలోని ఐదు పాఠశాలలను ఎంపిక చేస్తామన్నారు. ఈ ఏడాది స్కూల్ గేమ్స్ రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో రాణించిన క్రీడాకారులు తమ వివరాలను ఒంగోలులోని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యాలయంలో ఈనెల 18వ తేదీలోగా సమర్పించాలన్నారు.