'అమాయక ప్రజల ప్రాణాలు తీయడం దారుణం'
GDWL: ఉగ్రవాదం మానవత్వానికి శత్రువు అని, దేశంలో అమాయక ప్రజల ప్రాణాలు తీస్తున్న దారుణ ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని జోగుళాంబ గద్వాల జిల్లా మాజీ బీజేపీ అధ్యక్షుడు ఎస్. రామచంద్ర రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తాజాగా ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన అమాయకులకు ఐజలో గురువారం కార్యకర్తలతో కలిసి నివాళులర్పించారు.