VIDEO: పేకాటకు అడ్డాగా గెస్ట్ హౌస్
కోనసీమ: కాట్రేనికోన మండలం మొల్లేటిమొగ కొత్తపాలెం లైట్ హౌస్ సమీపంలో ఉన్న ఫారెస్ట్ గెస్ట్‌హౌస్‌లో పేకాట ఆడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో కలకలం రేపింది. చాకలి పాలెం వద్ద ఒక వ్యక్తి దగ్గర తాళాలు ఉండడంతో అతడు పేకాట రాయుళ్లకి సౌకర్యాలు కల్పిస్తున్నాడని అంటున్నారు. అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.