'సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి'
SRPT: ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన పెంచుకుని ప్రజలు ఆర్థికంగా ఎదగాలని ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి రజిత గోపు పిలుపునిచ్చారు. శనివారం చివ్వేంల మండలం పాండ్యనాయక్ తండాలో నిర్వహించిన న్యాయ అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. చిన్న సమస్యలను గ్రామంలోనే పరిష్కరించుకోవాలని, అవసరమైన వారికి ఉచిత న్యాయ సహాయం అందిస్తామని తెలిపారు.