ఉచిత కుట్టు మిషన్ శిక్షణా కార్యక్రమం ప్రారంభం

ఉచిత కుట్టు మిషన్ శిక్షణా కార్యక్రమం ప్రారంభం

విజయనగరం: ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి సోమవారం కోత్తవలసలో ఉచిత కుట్టుమిషన్ శిక్షణా కార్యక్రమాన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నిరుపేద మహిళల ఆర్థిక స్వావలంబనే కూటమి ప్రభుత్వ లక్ష్యంగా నియోజకవర్గంలో తొలి విడతగా 140 మంది మహిళలకు ఉచిత కుట్టు మిషన్‌ శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. కూటమి ప్రభుత్వంలో మహిళలకు సీఎం చంద్రబాబు పెద్దపీట వేస్తున్నారన్నారు.