పశువుల పాకలో అగ్నిప్రమాదం
MDK: ఆర్. వెంకటాపూర్ గ్రామం పిట్టలవాడలో పిట్టల రాజుకు చెందిన పశువుల పాకలో శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో పాక పూర్తిగా దగ్ధమైంది. స్థానికులు వెంటనే స్పందించి, నీటితో మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. పక్కనే ఉన్న నివాస గుడిసెలకు నిప్పు అంటకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.