వినాయక చవితి ఉత్సవాల అనుమతుల కోసం వినతి

SS: పుట్టపర్తిలో వినాయక చవితి ఉత్సవాల కోసం ప్రతిమల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలని సోమవారం స్థానిక యువత ఎలక్ట్రికల్ ఏఈ, మున్సిపల్ కమిషనర్, పోలీసులకు వినతి పత్రం అందించారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భద్రత కల్పించాలని వారు కోరారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రతిమలు ఏర్పాటు చేసుకోవాలని అధికారులు యువతకు సూచించారు.