VIDEO: తిమ్మారెడ్డి చెరువు ఆక్రమణపై గ్రామస్తుల ఆందోళన
అన్నమయ్య: వీరబల్లి మండలం పెద్దివీడు గ్రామంలో తిమ్మారెడ్డి చెరువు ఆక్రమణ ఆరోపణలతో గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. వీరబల్లి–రాయచోటి రహదారిపై బైఠాయించడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. చెరువును కాపాడాలని, అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రెవెన్యూ అధికారులపై గ్రామస్తులు తీవ్ర ఆరోపణలు చేశారు. ఉన్నతాధికారులు వెంటనే జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు.