'సమాచార హక్కు చట్టం అమలుకు చర్యలు తీసుకోవాలి'
NGKL: వంగూరు మండలంలో సమాచార హక్కు చట్టం అమలు పూర్తిగా నిర్వీర్యం అయిందని చట్టం అమలుకు చర్యలు తీసుకోవాలని మంగళవారం ఆర్టీఐ కార్యకర్తలు గుమ్మకొండ శివరాజ్, ఎన్నమల అనంత రాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎంపీడీవో కార్యాలయం అధికారులకు వినతిపత్రం సమర్పించారు. వారు మాట్లాడుతూ.. సమాచార హక్కు చట్టం అధికారులను నియమించి, బోర్డులు ఏర్పాటు చేయాలని కోరారు.