అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
KDP: సింహాద్రిపురం మండలం బిదనంచెర్ల గ్రామంలో మంగళవారం, అప్పుల బాధతో ముతల్లూరు పెద్దిరెడ్డి (40) అనే రైతు ఇంట్లోనే గుళికలు (పురుగుల మందు) తిని ఆత్మహత్య చేసుకున్నాడు. పంట కోసం తీసుకున్న అప్పులు తీర్చలేక మనస్థాపానికి గురైన పెద్దిరెడ్డి ఈ దారుణానికి పాల్పడ్డాడు. స్థానికులు అతన్ని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు నిర్ధారించారు.