ఏపీపీ రాజ్ కుమార్‌కు ఘన సన్మానం

ELR: నూజివీడు పట్టణంలోని 15వ అదనపు జిల్లా కోర్టు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా బాధ్యతలు స్వీకరించిన ప్రముఖ న్యాయవాది వాకా రాజ్ కుమార్‌ను జన సైనికులు ఆదివారం సన్మానించారు. జనసేన యువనేత ముత్యాల కామేష్ మాట్లాడుతూ.. పేదల పక్షాన నిలిచి న్యాయ సేవలు అందిస్తూ, అందరివాడిగా ఖ్యాతి పొందిన రాజ్ కుమార్ ఏపీపీగా బాధ్యతలు చేపట్టటం అభినందనీయమన్నారు.