పొగాకు రైతులకు న్యాయం చేయాలి: కలెక్టర్

పొగాకు రైతులకు న్యాయం చేయాలి: కలెక్టర్

బాపట్ల కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ నిన్న రాత్రి కలెక్టరేట్‌ వద్ద మార్క్‌ఫెడ్ డీఎం, పొగాకు ఫ్యాక్టరీల యాజమాన్యంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం కొనుగోలు చేసిన పొగాకు విషయంలో, ఫ్యాక్టరీ యాజమాన్యంతో సమన్వయం చేసుకుని రైతులకు న్యాయం చేద్దామని స్పష్టం చేశారు. రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు కృషి చేయాలని ఆదేశించారు.