"హర్ ఘర్ తిరంగా " ర్యాలీ నిర్వహించిన MLA

"హర్ ఘర్ తిరంగా " ర్యాలీ నిర్వహించిన MLA

VZM: బొబ్బిలి ఎమ్మెల్యే బేబినాయన ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక కోట నుంచి పుర వీధులలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 'హర్‌ ఘర్‌ తిరంగా' ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యే ప్రజలలో స్వాతంత్య్ర స్పూర్తిని నింపారు. ప్రజలు తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలని, ఆగస్టు 15 సాయంత్రం జండాను మర్యాదపూర్వకంగా దించాలని ఎమ్మెల్యే సూచించారు.