VIDEO: భారీగా లిక్విడ్ గంజాయి స్వాధీనం
విశాఖ-ఒడిశా సరిహద్దులోని కోరపుట్ జిల్లా నందపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు భారీగా లిక్విడ్ గంజాయిని పట్టుకున్నారు. వేర్వేరు ప్రాంతాల్లో నిర్వహించిన దాడుల్లో సుమారు రూ.200 కోట్ల విలువైన మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.