నీటిమట్టం గణనీయంగా పెరుగుతుంది

BDK: భారీ వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నది నీటిమట్టం గణనీయంగా పెరిగింది. శుక్రవారం అర్ధరాత్రి 12 గంటలకు 20.8 అడుగులుగా ఉన్న నీటిమట్టం, శనివారం ఉదయం 6 గంటలకు 26.3 అడుగులకు చేరుకుంది. అధికారులు ఈ నీటిమట్టం సాయంత్రానికి 28 అడుగుల వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.