చింతలపూడి స్టేషన్‌కి వాహనం బహుకరణ
ELR: చింతలపూడి పోలీస్ స్టేషన్‌కి ఓ కార్పొరేట్ సంస్థ అందించిన వాహనాన్ని జిల్లా ఎస్పీ ప్రతాప్ కిషోర్ చేతుల మీదుగా మంగళవారం అందించారు. పోలీసుల అవసరాలను గుర్తించి, నేర నియంత్రణకి ప్రజలకు వేగవంతమైన సేవలు అందించేందుకు స్వచ్ఛందంగా వాహనాన్ని ఇచ్చిన సంస్థని ఎస్పీ అభినందించారు. సమాజ రక్షణ కోసం చేసే దానం గొప్పదని వివరించారు.