బ్రిడ్జిపై కారు బీభత్సం.. మంటల్లో దగ్ధం!
RR: ఎల్బీనగర్ సాగర్ రింగ్ రోడ్ బ్రిడ్జిపై ఇవాళ తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. అతివేగంతో వెళ్తున్న ఓ కారు లారీని, డివైడర్‌ను బలంగా ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారులోని వారు మద్యం మత్తులో ఉన్నట్లు సమాచారం. వెంటనే రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.