బ్యాంకు ఉద్యోగుల ఆందోళన
MDK: కౌడిపల్లి డీసీసీబీ బ్యాంక్ ముందర బ్యాంకు ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ఉద్యోగులకు గతంలో ఇచ్చిన ఇన్సెంటివ్, ఎక్స్‌గ్రేషియా రికవరీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టారు. మే 2న ఒకరోజు సమ్మె నిర్వహిస్తున్నట్లు వివరించారు. అధికారులకు మెమోరండం సమర్పించుట, ప్రధాన కార్యాలయం ముందు ధర్నా, సామూహిక సెలవు తదితర ఆందోళనలు చేస్తున్నట్లు తెలిపారు