నేటి నుంచి ఈ ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం
అన్నమయ్య: రాజంపేట, తిరుపతి డివిజన్లలో నేటి నుంచి దాదాపు 2 నెలలపాటు అప్పుడప్పుడు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని రాజంపేట EE రాజశేఖర్ రెడ్డి తెలిపారు. 220 KV సబ్ స్టేషన్‌కు కొత్త లైను అనుసంధానం పనులవల్ల సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు 4 లేదా 5 గంటలు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగవచ్చని తెలిపారు. రాజంపేట, కోడూరు, ఓబులవారిపల్లె తదితర మండలాల్లోని వినియోగదారులు సహకరించాలన్నారు.