అడ్మినిస్ట్రేటివ్ అధికారిణి కి విలేఖరుల సంఘం వినతి

ATP: కళ్యాణదుర్గం ఆర్డీవో కార్యాలయంలో విలేఖరుల సంఘం నేతలు శుక్రవారం అడ్మినిస్ట్రేటివ్ అధికారిణి ఈశ్వరమ్మకు వినతి పత్రం అందజేశారు. పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగిస్తూ పోలీసులు వ్యవహరిస్తున్నారని, సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డిపై నోటీసులు లేకుండానే ఇంటిపై దాడి చేయడం దారుణమని తెలిపారు. కేవలం నిజాలను రాసినందుకే దాడులు జరుగుతున్నాయని వారు ఆరోపించారు.