అధికారులతో కేంద్రమంత్రి సమీక్ష

అధికారులతో కేంద్రమంత్రి సమీక్ష

W.G: భీమవరం మున్సిపల్ కమిషనర్, అధికారులతో మంగళవారం కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంట్రాక్టర్లకు రావాల్సిన రూ.18 కోట్ల 80 లక్షల పెండింగ్ బిల్లులపై అధికారులతో చర్చించారు. పెండింగ్ బిల్లులను త్వరలో విడుదలయ్యేలా చూస్తానని కాంట్రాక్టర్లకు ఆయన హామీ ఇచ్చారు. అభివృద్ధి పనులను వేగంగా, నాణ్యతతో పూర్తి చేయాలన్నారు.