భారీ వర్షానికి నీటమునిగిన పంట పొలాలు

భారీ వర్షానికి నీటమునిగిన పంట పొలాలు

GNTR: చేబ్రోలు మండలంలో కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాల్లోని పంట పొలాలు నీట మునిగాయి. శలపాడు, వీరనాయకునిపాలెం గ్రామాల మధ్య ఉన్న తుంగభద్ర డ్రైన్ పొంగి సమీపంలోని పొలాలను ముంచేసింది. ఈ ఖరీఫ్ సీజన్‌లో పంట నీట మునిగిపోవడం ఇది మూడోసారి అని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని శనివారం వారు కోరుతున్నారు.