నేటి నుంచి విద్యుత్ సరఫరాలో మార్పులు

నేటి నుంచి విద్యుత్ సరఫరాలో మార్పులు

ELR: పెదవేగి సబ్ స్టేషన్ గార్లమడుగు ఫీడరు RDS పనుల కారణంగా నేటి నుంచి 8 వరకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 వరకు వ్యవసాయ విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని ఈఈ అంబేద్కర్ ఓ ప్రకటనలో తెలిపారు. పెదవేగి, సూర్యరావుపేట, సీతాపురం, గార్లమడుగు గ్రామాల్లో తెల్లవారుజామున 3 నుంచి 9 వరకు, అనంతరం రాత్రి 10 గంటల నుంచి 12 వరకు రెండు విడతలుగా సరఫరా జరుగుతుందన్నారు.