VIDEO: శ్రీ కాల భైరవ పీఠంలో ఘనంగా గణపతి పూజలు

శ్రీకాకుళం పట్టణంలోని నాగావళి నది తీరంలో కొలువై ఉన్న శ్రీ బాల త్రిపుర కాలభైరవ పీఠములో ఘనంగా గణపతి పూజలు నిర్వహించారు. బుధవారం వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని పీఠాధిపతి గణేష్ గురువు ఆధ్వర్యంలో ఘనంగా పూజ కార్యక్రమాలు చేపట్టారు. ఆయన మాట్లాడుతూ.. ఈ తొమ్మిది రోజులు పాటు గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు.