'పాఠశాలలో మూత్రశాలల నిర్మాణం ప్రారంభించాలి'
MNCL: కన్నెపల్లి మండలంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ప్రహరీ గోడ, భోజనశాల నిర్మాణ పనులను పరిశీలించారు. త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, పాఠశాలలో మూత్రశాలల నిర్మాణ పనులు ప్రారంభించాలని అధికారులకు సూచించారు.