దర్శి మోడల్ స్కూల్ను సందర్శించిన అధికారులు
ప్రకాశం: దర్శిలో ఆదర్శ మోడల్ స్కూల్ ను శుక్రవారం కేంద్ర మానవ వనరుల శాఖ జాయింట్ సెక్రెటరీ ఘయాజుద్దీన్ అహ్మద్ సందర్శించారు. పిఎంశ్రీ పాఠశాలల తనిఖీలలో భాగంగా వచ్చారు. విద్యార్థులతో కొంత సమయం గడిపి వారి నుంచి పలు ప్రశ్నలకు సమాధానాలు రాబట్టారు. విద్యార్థుల సమాధానాలతో సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం తరగతి గదులు, ల్యాబ్లను సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు.