VIDEO: వృద్ధురాలి మెడలో బంగారు గొలుసు చోరీ

VIDEO: వృద్ధురాలి మెడలో బంగారు గొలుసు చోరీ

నెల్లూరు: వృద్ధురాలి మెడలోంచి బంగారు గొలుసు దొంగిలించిన ఘటన వింజమూరు మండలం చాకల కొండ గ్రామంలో జరిగింది. గుర్తుతెలియని ఇద్దరు దుండగులు బైక్‌పై వచ్చి గ్రామానికి చెందిన వృద్ధురాలు కాటంరెడ్డి చిన్న రవణమ్మ మెడలోంచి రెండున్నర సవరల బంగారు గొలుసు(విలువ రూ. 3 లక్షలు)ను దోచుకెళ్లారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు ఎస్సై వీర ప్రతాప్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.