పోలవరం ప్రాజెక్టుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కీలక వ్యాఖ్యలు

ELR: పోలవరం ప్రాజెక్టుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రాజెక్టు ఎత్తు 47.72 అడుగుల మేర కేంద్ర ప్రభుత్వం నిర్మించాలని.. 196 టీఎంసీల నీరు నిల్వ చేయాలని డిమాండ్ చేశారు. నిర్వాసితులకు పరిహారం పంపిణీ, ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలన్నారు. పోలవరం, బనకచర్ల ప్రాజెక్టులో ప్రైవేటు వ్యక్తులు జోక్యం చేసుకుంటే సీపీఐ చూస్తూ ఊరుకోదన్నారు.