ప్రమాదకరంగా మారిన గుంతలు

ప్రమాదకరంగా మారిన గుంతలు

KDP: ఖాజీపేట మండలం పూసల కొట్టాల వద్ద కడప కర్నూలు హైవే సర్వీస్ రోడ్డు మలుపు సమీపంలో ఆప్టిక్ ఫైబర్ కేబుల్ పనుల కోసం తవ్విన గుంతలు ప్రమాదకరంగా మారాయి. ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు మలుపు తిరిగేటప్పుడు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. ఈ గుంతల వల్ల ప్రమాదాలు పొంచి ఉన్నాయని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుంతలను పూడ్చాలని స్థానికులు కోరుతున్నారు.