VIDEO: కరెంట్ షాక్‌తో యువకుడికి తీవ్ర గాయాలు

VIDEO: కరెంట్ షాక్‌తో యువకుడికి తీవ్ర గాయాలు

అన్నమయ్య: మదనపల్లె రింగురోడ్డులో పీఓపీ పనులు చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై ఉత్తరప్రదేశ్‌కు చెందిన తస్లీమ్ (19) అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. తక్కువ కూలితో రాత్రి వేళల్లో పనులు చేయిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. బాధితుడిని వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఆసుపత్రి అవుట్‌పోస్ట్ పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.