పోలీసు సిబ్బందికి హెల్మెట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ప్రకాశం: హెల్మెట్ ధరించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి అన్నారు. గిద్దలూరు పట్టణంలోని విట్టా శుభరాత్రి మండపంలో అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గిద్దలూరు రాచర్ల కొమరోలు పోలీసులకు హెల్మెట్లు వాటర్ బాటిల్లు క్యాప్‌లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పోలీస్ సిబ్బందికి హెల్మెట్లు పంపిణీ చేశారు.