జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
NZB: జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. ఎడపల్లి 38.9°C, గోపన్ పల్లి, మదన్ పల్లి, పెర్కిట్ నిజామాబాద్ (నార్త్) 38.8, నిజామాబాద్ (సౌత్), కోటగిరి 38.7, మోర్తాడ్ 38.6, సాలూర 38.5°Cలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జిల్లాలోని 45 వెదర్ స్టేషన్లలో 35° Cలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కాగా తుంపల్లిలో 14 మి.మీ వర్షపాతం రికార్డు అయ్యింది.