VIDEO: క్షయ రహితంగా మార్చేందుకు చర్యలు
కోనసీమ: దేశాన్ని క్షయ వ్యాధి రహితంగా మార్చేందుకు ప్రభుత్వం పకడ్బందీ కార్యాచరణ చేపట్టిందని డాక్టర్ దివ్యదర్శిని తెలిపారు. కడలిలో బుధవారం నిర్వహించిన 'టీబీ-ముక్త భారత్ అభియాన్' అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఆరోగ్య సిబ్బంది ప్రతి ఇంటికీ వెళ్లి వ్యాధి లక్షణాలను గుర్తించి, బాధితులకు అవసరమైన మందులు, సలహాలు అందజేస్తున్నారని వివరించారు.