VIDEO: 'విద్యా రంగానికి మొండి చేయి చూపించారు'
HNK: రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం మొండి చేయి చూపించిందని SFI జిల్లా కార్యదర్శి మంద శ్రీకాంత్ అన్నారు. హనుమకొండ రాంనగర్ అంబేద్కర్ సెంటర్ వద్ద రహదారిపై బడ్జెట్ పత్రాలను దహనం చేశారు. రాష్ట్రంలో విద్య రంగ సమస్యలు పరిష్కారం కావాలంటే విద్య రంగానికి 30 శాతం నిధులు కేటాయించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పాల్గొన్నారు.