సర్పంచ్‌ని పరామర్శించిన ఎమ్మెల్యే
SKLM: పాతపట్నం సర్పంచ్ సిర్ల వేణుకుమారి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుందని తెలుసుకున్న ఎమ్మెల్యే మామిడి గోవిందరావు సోమవారం ఆమె స్వగృహానికి వెళ్లి పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్యులు అందిస్తున్న చికిత్స వివరాలను కుటుంబ సభ్యులతో చర్చించి ధైర్యం చెప్పారు.